బాధ్యతలు చేపట్టిన వెంటనే బైడెన్ సంతకం చేసిన ఆదేశాలు ఇవే!
- 15 కీలక ఆదేశాలపై సంతకం చేసిన బైడెన్
- కరోనాకు అడ్డుకట్ట వేసే చర్యలు..
- ప్రపంచ ఆరోగ్య సంస్థలో మళ్లీ భాగస్వామ్యం
- మెక్సికో గోడ నిర్మాణం నిలుపుదల
డబ్ల్యూహెచ్ఓ సమావేశాలకు ఇక నుంచి సాంక్రమిక వ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌసీ బృందం ప్రాతినిధ్యం వహించనుంది. వీటితోపాటు పారిస్ వాతావరణ ఒప్పందంలో ఆమెరికాను మళ్లీ భాగస్వామిని చేయడం, ముస్లిం దేశాలకు రాకపోకలపై ట్రంప్ విధించిన నిషేధాన్ని ఎత్తివేయడం, మెక్సికో గోడ నిర్మాణాన్ని నిలిపివేయడం, దేశాభివృద్ధిలో భాగస్వామ్యమైన వారికి శాశ్వత నివాసం/పౌరసత్వ కల్పన వంటి ఉత్తర్వులు ఉన్నాయి.