ఎల్లుండి సీడబ్ల్యూసీ సమావేశం.. పార్టీ అధ్యక్షుడి ఎన్నిక తేదీపై నిర్ణయం!
- వర్చువల్ విధానంలో జరగనున్న సమావేశం
- తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చ
- బడ్జెట్ సమావేశాలకు ముందు నిర్వహించడంపై ప్రాధాన్యం
పార్లమెంటు సమావేశాలు జరగడానికి వారం రోజుల ముందు ఈ సమావేశం జరగనుండడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే, పార్లమెంటు సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపైనా ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలపై రైతులు చేపట్టిన ఆందోళనపైనా చర్చించనున్నారు.