తెలుగు రాష్ట్రాల్లో సోనూసూద్ అంబులెన్స్ సేవలు ప్రారంభం
- ఇటీవల కొన్ని వ్యాన్లను కొనుగోలు చేసిన సోనూసూద్
- వాటిని అంబులెన్సులుగా మార్పించి సేవలు
- వైద్య సాయం కావాల్సిన పేదలకు సర్వీసు
ట్విట్టర్ వేదికగా సాయం కోరిన వారికి ఆయన అభయమిస్తూ పేదల కష్టాలను తీరుస్తున్న సోనూసూద్ ఇప్పుడు అంబులెన్సు సర్వీసులను ప్రారంభించారు. ఇటీవల కొన్ని వ్యాన్లను కొనుగోలు చేసిన సోనూసూద్ వాటిని అంబులెన్సులుగా మార్పించి తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం వాటిని ప్రారంభించారు. వైద్య సాయం కావాల్సిన పేదలకు ఈ సేవలు అందుతాయి. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ సమీపంలో ఈ అంబులెన్సులు సోనూసూద్ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి.