అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడంటూ ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ కు జరిమానా
- సిడ్నీ టెస్టులో ఘటన
- పుజారా అవుట్ కోసం డీఆర్ఎస్ కోరిన పైన్
- డీఆర్ఎస్ లో ఆస్ట్రేలియాకు వ్యతిరేక ఫలితం
- అసహనం ప్రదర్శించిన పైన్
సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా, పుజారా అవుట్ కోసం డీఆర్ఎస్ కోరారు. డీఆర్ఎస్ ఫలితం ఆసీస్ కు వ్యతిరేకంగా రావడంతో పైన్ అంపైర్ పట్ల తన అసహనాన్ని ప్రదర్శించాడు. పైన్ తన తప్పిదాన్ని అంగీకరించడంతో జరిమానాతో సరిపెట్టారు.