హైదరాబాద్ లో సూట్ కేసులో మృతదేహం.. స్వాధీనం చేసుకున్న పోలీసులు
- రాజేంద్రనగర్లో ఘటన
- ఇద్దరు జేబు దొంగల ఘాతుకం
- తోటి దొంగను చంపిన కేటుగాళ్లు
ఆ సూట్ కేసును ఎక్కడ పడేశామన్న విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. సూట్ కేసులోని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు రషీద్ చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన వ్యక్తని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుపుతున్నారు.