Corona Virus: ఏపీ కరోనా అప్ డేట్: రాష్ట్రంలో మరింతగా తగ్గిన కొత్త కేసులు

Corona mew cases number massively dropped in AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా వ్యాప్తి బాగా తగ్గిపోయింది. గడచిన 24 గంటల్లో 50,445 కరోనా పరీక్షలు నిర్వహించగా 199 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 35, కృష్ణా జిల్లాలో 35 కొత్త కేసులు వెల్లడయ్యాయి. చిత్తూరు జిల్లాలో 23, తూర్పు గోదావరి జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రెండు చొప్పున కేసులు గుర్తించారు.

అదే సమయంలో 423 మంది కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7,128కి చేరింది. ఇప్పటివరకు ఏపీలో 8,84,689 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,74,954 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 2,607 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Corona Virus
Andhra Pradesh
Update
Positive Cases
Deaths
Active Cases
COVID19

More Telugu News