సీఎం పదవి నుంచి తనను తొలగిస్తున్నారనే వార్తలపై యడియూరప్ప స్పందన
- పూర్తి కాలం పదవిలో కొనసాగుతానన్న యడియూరప్ప
- తన పట్ల హైకమాండ్ సంతృప్తిగా ఉందని వ్యాఖ్య
- జనవరి 15న కర్ణాటకకు వస్తున్న అమిత్ షా
ఇదిలావుంచితే, మరోపక్క, జనవరి మొదటి వారంలో బీజేపీ శాసనసభ్యులు సమావేశం కానున్నారు. 4వ తేది నుంచి రెండు రోజుల పాటు ఈ భేటీ జరగనుంది. ఈ భేటీకి సంబంధించిన అజెండా ఏమిటనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. జనవరి 15 నుంచి రెండు రోజుల పర్యటనకు గాను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటకకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల సమావేశం చర్చనీయాంశంగా మారింది.