ఆ రెండో కంగన గురించి నాకు ఏమాత్రం తెలియదు: దర్శకుడు అనురాగ్ బసు

Bollywood director Anurag Basu opines on Kangana Ranaut
బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న కంగన రనౌత్ పై ఆమె మొదటి చిత్రం దర్శకుడు అనురాగ్ బసు తన అభిప్రాయాలు వెల్లడించారు. కంగన 2006లో వచ్చిన గ్యాంగ్ స్టర్ చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. ఆ సినిమాకు అనురాగ్ బసు దర్శకుడు.

తాజాగా బసు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, వ్యక్తిగతంగా తనకు తెలిసిన కంగన వేరని అన్నారు. కంగన ప్రతిభ గురించి గ్యాంగ్ స్టర్ సమయంలోనే అర్థమైందని తెలిపారు. చాలా విభిన్నమైన వ్యక్తి అని తెలుసుకున్నానని, ఏ విషయాన్నయినా ఇట్టే గ్రహించేదని వెల్లడించారు.

అయితే తనకు తెలిసినంతవరకు ఇప్పుడున్న కంగన, గతంలో ఉన్న కంగన మధ్య ఎంతో తేడా ఉందని చెప్పారు. చూస్తుంటే ఇద్దరు కంగనాలు ఉన్నట్టు అనిపిస్తోందని, వారిలో ఒక కంగన గురించి తనకు తెలుసుని, ఈ రెండో కంగన గురించి తనకేమీ తెలియదని, అసలేమాత్రం అర్థం కాదని బసు వ్యాఖ్యానించారు. తాము కలుసుకోవడం చాలా తక్కువ అని, ఎప్పుడన్నా కలిస్తే చాలా సరదాగా ఉంటుందని వెల్లడించారు.
Go Back to Shorts
Anurag Basu
Kangana Ranaut
Gangster
Bollywood

More Telugu News