అప్పట్లో చంద్రబాబు రిషితేశ్వరి కుటుంబాన్ని బెదిరింపులకు గురిచేశాడు: విజయసాయిరెడ్డి
- స్టూడెంట్ రిషితేశ్వరి చనిపోతే అప్పట్లో విచారణ చేపట్టలేదు
- స్నేహలత విషయంలో ఇప్పుడు సమగ్ర విచారణ
- ఆ కుటుంబానికి అండగా ప్రభుత్వం
- విశాఖలో వేల కోట్ల విలువైన భూములను కబ్జా చేసిందెవరు?
విశాఖలో వేల కోట్ల విలువైన భూములను కబ్జా చేసిందెవరు? అంటూ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీపై ఆరోపణలు గుప్పించారు. ‘వైసీపీ వస్తే రాయలసీమ రౌడీలు మీ భూములను ఆక్రమిస్తారు. మీ ఇంటి నుంచి మిమ్మల్ని గెంటేస్తారని ఎన్నికలప్పుడు బాబు దిగజారి మరీ దుష్ప్రచారం చేశాడు. బ్యాంకుల నుంచి 8 వేల కోట్ల రూపాయలు లూటీ చేసిన రాయపాటి ఎవరు? విశాఖలో వేల కోట్ల విలువైన భూములను కబ్జా చేసిందెవరు? మీవాళ్లేగా బాబూ!’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.