vikram: ‘కోబ్రా’ నుంచి హీరో విక్రమ్ వెరైటీ లుక్ విడుద‌ల‌

cobra new look releases
షార్ట్స్‌లో చూడండి
విభిన్న తరహా కథా చిత్రాలలో నటిస్తూ అలరిస్తోన్న హీరో విక్రమ్ ప్రస్తుతం ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో 'కోబ్రా' సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా నుంచి విక్ర‌మ్ లుక్‌ను విడుదల చేశారు. వెరైటీ హెయిర్ స్టైల్‌తో ఆయన కనపడుతోన్న తీరు ఆకర్షిస్తోంది.

కళ్ల జోడు పెట్టుకున్న ఆయన తన కుడి కన్నులోంచి కొన్ని మ్యాథ్స్ కి సంబంధించిన అంకెలను చూస్తున్నట్లు ఈ లుక్ ఉంది. దీనికి, ప్రతి సమస్యకూ మ్యాథమెటిక్స్‌లో పరిష్కారం ఉంటుందని క్యాప్షన్ పెట్టారు. ఇందులో విక్ర‌మ్ 20కి పైగా పాత్ర‌ల‌లో నటిస్తున్న‌ట్టు టాక్. సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మిస్తున్న కోబ్రా సినిమా రూపుదిద్దుకుంటోంది. ర‌ష్యాలోనూ ఈ సినిమా షూటింగ్ గతంలో కొనసాగింది. ఇందులో టీమిండియా మాజీ క్రికెట‌ర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా నటిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
 
Go Back to Shorts
vikram
Tamilnadu
Tollywood

More Telugu News