రైతుల పరిహారంపై కృష్ణా జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించాలని పవన్ నిర్ణయం
Add ap7am to your home Screen

రైతుల పరిహారంపై కృష్ణా జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించాలని పవన్ నిర్ణయం

Pawan Kalyan responds over Nivar cyclone effected farmers ex gratia
  • నివర్ తుపానుతో రైతన్నల విలవిల
  • లక్షల ఎకరాల్లో పంట నష్టం
  • రూ.35 వేల పరిహారం ఇవ్వాలంటున్న పవన్ కల్యాణ్
  • తక్షణ సాయంగా రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్
  • రాష్ట్రవ్యాప్తంగా జైకిసాన్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం
ఇటీవల సంభవించిన నివర్ తుపాను ఏపీ రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు తగిన పరిహారం ఇవ్వాలంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ఈ నెల 28న కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ను కలిసి వినతిపత్రం అందించనున్నారు. తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు రూ.35 వేలు పరిహారంగా చెల్లించాలని, తక్షణ సాయంగా రూ.10 వేలు అందించాలని పవన్ కోరుతున్నారు.

ఈ నెల 28వ తేదీ ఉదయం 9 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి గుడివాడ, పెడన పట్టణాల మీదుగా మచిలీపట్నం చేరుకుని జిల్లా కలెక్టర్ ను కలవనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వినతిపత్రం అందజేస్తారు. అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా జనసేన తలపెడుతున్న జైకిసాన్ కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల్లో జనసేన నేతలు నివర్ తుపాను బాధిత రైతుల తరఫున వినతి పత్రాలు సమర్పిస్తారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Pawan Kalyan
Farmers
Nivar
Krishna District
District Collector
JaiKisan
Janasena
Andhra Pradesh

More Telugu News