ట్విట్టర్లో మరో రికార్డు సొంతం చేసుకున్న మహేశ్ బాబు

Mahesh Babu sets new record on Twitter
  • దక్షిణాది హీరోలలో మహేశ్ రికార్డు
  • ట్విట్టర్లో 11 మిలియన్ల ఫాలోవర్స్  
  • ఫేస్ బుక్ లో 5.8 మిలియన్లు
  • ఇన్ స్టాలో 6.1 మిలియన్ల ఫాలోవర్లు  
మన సినిమా హీరోలకు వుండే క్రేజ్ .. ఫాలోయింగ్ ఎలాంటిదో మనకు తెలుసు. ఇంకా తెలుసుకోవాలంటే ఆయా హీరోల సోషల్ మీడియా అకౌంట్స్ చూడాలి. వాళ్లకున్న క్రేజ్ ను బట్టి ఇక్కడ ఫాలోవర్స్ చేరుతుంటారు. ఆ విధంగా చూస్తే, టాలీవుడ్ లో మహేశ్ బాబు ముందువరసలో కనిపిస్తూవుంటాడు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లలో బిజీగా ఉంటూ, మహేశ్ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటాడు.

ఈ క్రమంలో ట్విట్టర్ అకౌంటులో మహేశ్ బాబు తాజాగా రికార్డు సొంతం చేసుకున్నాడు. 11 మిలియన్ల ఫాలోవర్స్ తో ఇప్పుడు సౌత్ హీరోలలో మహేశ్ ట్విట్టర్లో రికార్డు కొట్టాడు. దీంతో అభిమానులు సందడి చేస్తూ.. #11millionmaheshians హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరోపక్క, ఫేస్ బుక్ లో 5.8 మిలియన్లు, ఇన్ స్టాలో 6.1 మిలియన్ల ఫాలోవర్లతో మహేశ్ దూసుకుపోతున్నాడు.
Go Back to Shorts
Mahesh Babu
Twitter
Facebook
Instagram

More Telugu News