Police: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అరెస్టు

police arrest vh
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావును పోలీసులు ఈ ఉదయం అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ లో రైతులు నిర్వహిస్తోన్న ధర్నాలో పాల్గొనడానికి వీహెచ్ వెళ్లారు.

అయితే, ఆయనను పెంబర్తి వద్ద ఈ రోజు ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఆయనను వ్యానులో లింగాల ఘనపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Police
VH
Congress

More Telugu News