థాంక్యూ సోనూ సూద్... నీ మనసు బంగారం: చిరంజీవి
- చిరంజీవి ఎంతో సహృదయుడన్న సోనూ సూద్
- వినమ్రంగా కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి
- లక్షల మందికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్ష
- ఇలాగే సేవలు కొనసాగించాలని వ్యాఖ్యలు
- ఈ గుర్తింపుకు నువ్వు అర్హుడివేనంటూ ట్వీట్
థాంక్యూ సోనూ సూద్ అంటూ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మానవత్వమున్న వ్యక్తుల్లో నీవు కూడా ఉన్నావు సోనూ అంటూ కొనియాడారు. అవసరంలో ఉన్నవారిని ఆదుకునే నీ అద్భుతమైన సహాయక చర్యలను కొనసాగించాలి అని ఆకాంక్షించారు. లక్షలాది మంది ప్రజలకు ఇలాగే స్ఫూర్తిగా నిలవాలని, ఈ దిశగా మరింత శక్తిని పొందాలని దీవించారు. "నీ మనసు బంగారం సోనూ సూద్... ఇప్పుడు నీకు లభిస్తున్న ఈ గుర్తింపుకు నువ్వు అక్షరాలా అర్హుడివే" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.