భవిష్యత్తులో బాబ్రీ మసీదు ఇలా ఉంటుంది... మోడల్ పిక్ విడుదల చేసిన యూపీ!
Add ap7am to your home Screen

భవిష్యత్తులో బాబ్రీ మసీదు ఇలా ఉంటుంది... మోడల్ పిక్ విడుదల చేసిన యూపీ!

Futuristic Design for Ayodhya Maszid
  • అయోధ్యలో మసీదును పునర్నిస్తామన్న ప్రభుత్వం
  • ప్రపంచ మసీదుల డిజైన్లను పరిశీలించి తయారీ
  • రెండో దశలో పక్కనే ఆసుపత్రి నిర్మాణం
అయోధ్యలోని రామజన్మభూమిని హిందూ సంస్థలకు అప్పగిస్తూ, గత సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత రామాలయం నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అయోధ్యలో బాబ్రీ మసీదును పునర్మిస్తామని, ఆ పక్కనే ఓ అత్యాధునిక అసుపత్రి కూడా ఉంటుందని వెల్లడించిన యూపీ సర్కారు, మోడల్ చిత్రాలను విడుదల చేసింది. మసీదు నిర్మాణానికి పునాదిరాయి వచ్చే సంవత్సరంలో పడుతుందని, ఆపై రెండో దశలో ఆసుపత్రి నిర్మాణం ప్రారంభిస్తామని ప్రభుత్వం పేర్కొంది.

అయితే, పునర్నిర్మాణం తరువాత మసీదుకు ఏ పేరు పెడతారన్న విషయాన్ని మాత్రం ఇంకా నిర్ణయించలేదని, ఏదైనా ముస్లిం చక్రవర్తి లేదా రాజు పేరిట ఇది ఉంటుందని ఐఐసీఎఫ్ (ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్) ట్రస్ట్ వ్యాఖ్యానించింది. ప్రపంచంలోని ఎన్నో మసీదుల నిర్మాణాలను పరిశీలించిన అనంతరం ఈ మసీదు ప్లాన్ ను రూపొందించామని, భావితరాలను ప్రతిబింబించేలా ఆసుపత్రి నిర్మాణం ఉంటుందని వెల్లడించింది.

Ayodhya
Ram Mandir
Maszid
Hospital

More Telugu News