ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లలో పని చేసిన ఏకైక అధికారి.. 100వ జన్మదినం జరుపుకుంటున్న యోధుడు !
- త్రివిధ దళాల్లో పని చేసిన ప్రీతిపాల్ సింగ్ గిల్
- రెండో ప్రపంచ యుద్ధానికి ముందు రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్సులో తొలి ఉద్యోగం
- 1965లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో పాల్గొన్న గిల్
వరల్డ్ వార్-2 తో పాటు 1965లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో కూడా గిల్ పాల్గొన్నారు. పదవీ విరమణ పొందడానికి ముందు మణిపూర్ లో అస్సాం రైఫిల్స్ విభాగంలో సెక్టార్ కమాండర్ గా ఆయన విధులు నిర్వహించారు. గిల్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.