Corona Virus: తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

721 new cases in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో గత 24 గంటల్లో 721 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 753 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,75,261కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,66,120 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1480కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 7,661 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 5,576 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 123, రంగారెడ్డి జిల్లాలో 51 కరోనా కేసులు నమోదయ్యాయి.

Go Back to Shorts
Corona Virus
COVID19
Telangana

More Telugu News