రంగంలోకి దిగిన అమిత్ షా.. చర్చల కోసం రైతులకు ఆహ్వానం
- వ్యవసాయ చట్టాలపై కొనసాగుతున్న ఆందోళనలు
- రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు విఫలం
- సాయంత్రం 7 గంటలకు రైతులతో అమిత్ షా చర్చలు
చర్చలకు రావాల్సిందిగా అమిత్ షా నుంచి పిలుపు వచ్చినట్టు రైతు నేత రాకేశ్ తెలిపారు. అమిత్ షా నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని... చర్చలకు రావాలని ఆయన తమను ఆహ్వానించారని రాకేశ్ చెప్పారు. సాయంత్రం 7 గంటలకు సమావేశం జరగనుందని తెలిపారు. ఢిల్లీ చుట్టుపక్కల జాతీయ రహదారులపై నిరసనలు తెలుపుతున్న రైతు నేతలందరూ ఈ చర్చలకు హాజరవుతారని చెప్పారు.