మీ సేవ సెంటర్లకు ఎవరూ రావద్దు... వరద బాధితుల వివరాలు తామే సేకరిస్తున్నామన్న జీహెచ్ఎంసీ!
- ఎన్నికల కారణంగా ఆగిపోయిన వరదసాయం పంపిణీ
- నేటి నుంచి ఇస్తారని దరఖాస్తు కోసం భారీ క్యూ
- తామే వివరాలు సేకరిస్తున్నామన్న జీహెచ్ఎంసీ కమిషనర్
ఎవరూ మీ సేవ సెంటర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. తమ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారని వెల్లడించిన ఆయన, వరదసాయం అందని వారి వివరాలను, బ్యాంకు ఖాతాలను స్వయంగా సేకరిస్తున్నారని తెలిపారు. బాధితుల ఖాతాలోనే సాయాన్ని జమ చేస్తామని ఆయన వెల్లడించారు. అర్హులను తామే గుర్తిస్తామని స్పష్టం చేశారు.