ఎన్టీ రామారావుతో కేసీఆర్... అరుదైన ఫొటో సోషల్ మీడియాలో వైరల్!
- తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే నేతగా కేసీఆర్ ప్రస్థానం
- టీడీపీలో కేసీఆర్ మూలాలు
- కాంగ్రెస్ నుంచి టీడీపీలో ప్రవేశం
- ఎన్టీఆర్ పై అభిమానంతో పార్టీలో చేరిక
తొలినాళ్లలో విద్యార్థి విభాగం నేతగా కాంగ్రెస్ లో ఉన్న కేసీఆర్ తనకెంతో ఇష్టుడైన ఎన్టీ రామారావు పార్టీ పెట్టడంతో కాంగ్రెస్ ను వీడి టీడీపీకి వచ్చారు. అప్పట్లో ఎన్టీఆర్ కూడా కేసీఆర్ ను ఎంతో అభిమానించేవారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ తో కేసీఆర్ కలిసున్నప్పటి ఓ అరుదైన ఫొటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఎన్టీఆర్ కాషాయ దుస్తుల్లో ఉండగా, యువకుడిగా ఉన్న కేసీఆర్ తన అభిమాన నేతపై ఆరాధ్యభావంతో చూస్తున్న దృశ్యం ఆ ఫొటోలో ఆవిష్కృతమైంది.