Corona Virus: తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

new  631 COVID19 infections in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో గత 24 గంటల్లో 631 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ఇద్దరు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 802 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,72,123కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,61,830 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,467కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 8,826 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 6,817 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 109, రంగారెడ్డి జిల్లాలో 49 కరోనా కేసులు నమోదయ్యాయి.
  
Go Back to Shorts
Corona Virus
COVID19
Telangana

More Telugu News