Corona Virus: తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

new 565 COVID19 infections in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో గత 24 గంటల్లో 565 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ఒకరు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 925 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,70,883కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,60,155 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,462కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 9,266 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 7,219 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 106 కరోనా కేసులు నమోదయ్యాయి.
Go Back to Shorts
Corona Virus
COVID19
Telangana

More Telugu News