Vikram: అల్లు అర్జున్ 'పుష్ప'లో మరో ప్రముఖ హీరో?

Another hero to play key role in Pushpa
షార్ట్స్‌లో చూడండి
'అల వైకుంఠపురములో' చిత్రం తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం 'పుష్ప'. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరుగుతోంది. కాగా, ఈ చిత్రంలో హీరో పాత్ర కాకుండా మరో కీలక పాత్ర ఒకటి వుంది. దీని కోసం మొదట్లో తమిళ నటుడు విజయ్ సేతుపతిని అనుకోవడం.. తర్వాత ఆయన ప్రాజక్టు నుంచి తప్పుకోవడం జరిగింది.

ఆ తర్వాత ఈ పాత్రకు ఉపేంద్ర, సుదీప్ వంటి ప్రముఖ నటుల పేర్లు వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా తమిళ కథానాయకుడు విక్రమ్ పేరు తెరపైకి వచ్చింది. విభిన్న పాత్రలు పోషిస్తూ విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న విక్రమ్ అయితే, ఈ పాత్రకు మరింత స్టేచర్ కూడా వస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ప్రస్తుతం ఆయనతో సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలో వాస్తవం ఎంతుందనేది త్వరలో తెలుస్తుంది.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రను పోషిస్తున్నాడు. ఆయన సరసన రష్మిక కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.
Go Back to Shorts
Vikram
Allu Arjun
Sukumar
Rashmika Mandanna

More Telugu News