అడ్డంకులు దాటిన సూర్య 'కరుప్పు'.. ఈరోజే థియేటర్లలోకి!
- సూర్య 'కరుప్పు' విడుదలకు మార్గం సుగమం
- ఆర్థిక సమస్యల కారణంగా గురువారం నిలిచిపోయిన ప్రదర్శనలు
- విడుదల ఆలస్యంపై కన్నీళ్లు పెట్టుకున్న దర్శకుడు ఆర్జే బాలాజీ
- అభిమానులకు క్షమాపణలు చెబుతూ నిర్మాణ సంస్థ భావోద్వేగ ప్రకటన
- అన్ని సమస్యలు పరిష్కారమవడంతో నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'కరుప్పు' సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. ఆర్థికపరమైన అడ్డంకుల కారణంగా గురువారం నిలిచిపోయిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గంటల తరబడి సాగిన తీవ్రమైన చర్చల తర్వాత సమస్యలు పరిష్కారమవడంతో, అభిమానుల నిరీక్షణకు తెరపడింది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా భావోద్వేగ ప్రకటన విడుదల చేసింది. "కరుప్పు కోసం ఎదురుచూసిన ప్రతి ఒక్కరికీ, మాపై నమ్మకం ఉంచిన అభిమానులకు క్షమాపణలు, కృతజ్ఞతలు. ఈ నిరీక్షణ మీకు బాధ కలిగించిందని మాకు తెలుసు. మీ ప్రేమ, మద్దతే మా కలను సజీవంగా ఉంచాయి. ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, నిద్రలేని రాత్రుల ఫలమైన ఈ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది" అని పేర్కొంది.
ముందుగా గురువారం విడుదల కావాల్సిన ఈ సినిమా ఆర్థిక సమస్యల వల్ల ఆగిపోవడంతో ఉదయం షోలు రద్దయ్యాయి. దీంతో దర్శకుడు ఆర్జే బాలాజీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేస్తూ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. సినిమా విడుదల ఆలస్యమైనందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు. తన సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
హీరో సూర్య కూడా స్పందిస్తూ "మాతో ఉన్నందుకు ధన్యవాదాలు. 'కరుప్పు' ('వీరభద్రుడు') ఈ రోజు నుంచి" అని అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. చివరికి అన్ని సమస్యలు తొలగిపోవడంతో చిత్రబృందం, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.