వారిద్దరినీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో సస్పెండ్ చేసింది: పొన్నం ప్రభాకర్
- బీజేపీ, టీఆర్ఎస్ లు తెలంగాణకు చేసిందేమీ లేదు
- వరద సాయం పేరుతో టీఆర్ఎస్ నేతలు దోచుకున్నారు
- 2009 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటాం
బీజేపీ నేతలు అర్ధరాత్రి కాంగ్రెస్ నేతల ఇళ్లలోకి వెళ్తున్నారని... బీజేపీలోకి చేర్చుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ మేయర్ బండ కార్తీకలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో సస్పెండ్ చేసిందని... వీరిని పార్టీలో చేర్చుకున్నామని బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 2009 జీహెచ్ఎంసీ ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలను ఈసారి కాంగ్రెస్ గెలుచుకుంటుందని అన్నారు.