Chiranjeevi: 'సామ్ జామ్' వేదికపై చిరంజీవి... స్టయిలిష్ లుక్ తో అదరగొడుతున్న మెగాస్టార్

Megastar Chiranjeevi attends to SamJam shoot
షార్ట్స్‌లో చూడండి
అతి తక్కువ సమయంలోనే విశేష ప్రజాదరణ పొందిన 'ఆహా' ఓటీటీ వేదిక వినూత్నమైన కార్యక్రమాలతో ఆకట్టుకుంటోంది. ఇటీవలే  'సామ్ జామ్' పేరిట ఓ టాక్ షోను ప్రారభించింది.  ఈ స్పెషల్ టాక్ షోకు అందాలభామ సమంత హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సమంత ప్రముఖ వ్యక్తులను ఇంటర్వ్యూ చేయనుంది.

తాజాగా, 'సామ్ జామ్' షోలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన అన్నపూర్ణ స్టూడియోకు రాగా కెమెరాలు క్లిక్ మన్నాయి. సరికొత్త లుక్ తో చిరంజీవి ఆకర్షణీయంగా కనిపిస్తుండడం ఈ ఫొటోల్లో చూడొచ్చు. బ్లేజర్, డెనిమ్ ప్యాంట్స్ లో స్లిమ్ గా ఉన్న చిరంజీవి సామ్ జామ్ వేదికపై తళుక్కుమన్నారు.
Go Back to Shorts
Chiranjeevi
SamJam
Samantha
Aha
OTT
Talk Show

More Telugu News