Prashant Kishor: బీహార్ సీఎంగా మళ్లీ గద్దెనెక్కిన నితీశ్ కుమార్ పై ప్రశాంత్ కిశోర్ వ్యంగ్యం

Prashant Kishore satires on Bihar CM Nitish Kumar
షార్ట్స్‌లో చూడండి
బీహార్ సీఎంగా ఇవాళ జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ మాజీ నేత ప్రశాంత్ కిశోర్ వ్యంగ్యం ప్రదర్శించారు. అలసిపోయిన, రాజకీయపరంగా కుచించుకుపోయిన వ్యక్తి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారని, బీహార్ ప్రజలు మరికొన్నేళ్ల పాటు నాసిరకం పాలనను భరించేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు.

ఎన్నికల వ్యూహకర్తగా జాతీయస్థాయిలో పేరుతెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్ గతంలో జేడీయూ పార్టీకి ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. అయితే నితీశ్ తో పొసగక అసంతృప్తి గళం వినిపించారు. దాంతో నితీశ్ ఆయనను పార్టీ నుంచి సాగనంపారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ తన అక్కసు వెళ్లగక్కినట్టు అర్థమవుతోంది.
Go Back to Shorts
Prashant Kishor
Nitish Kumar
Bihar
JDU
Elections

More Telugu News