సీఎం జగన్ లేఖ కేసు విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ లలిత్ కుమార్
- సంచలనం సృష్టించిన సీఎం జగన్ లేఖ
- ఇది కోర్టు ధిక్కరణ అంటూ జగన్ కు వ్యతిరేకంగా పిటిషన్లు
- వాది, ప్రతివాదుల్లో ఒకరి తరఫున గతంలో వాదించానన్న లలిత్ కుమార్
అయితే ఈ కోర్టు ధిక్కార పిటిషన్ల విచారణ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుంది. ఈ పిటిషన్లపై విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనం నుంచి జస్టిస్ లలిత్ కుమార్ వైదొలిగారు. ఈ పిటిషన్లకు సంబంధించి వాది, ప్రతివాదుల్లో ఒకరి తరఫున తాను గతంలో వాదించానని, అందువల్ల తాను ఈ విచారణలో పాలుపంచుకోలేనని జస్టిస్ లలిత్ కుమార్ స్పష్టం చేశారు. ఈ విచారణను చీఫ్ జస్టిస్ మరో ధర్మాసనానికి కేటాయిస్తారని వివరించారు.