Corona Virus: దేశంలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

new 44684 COVID19 infections in India
షార్ట్స్‌లో చూడండి
భారత్ లో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 44,684 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 87,73,479 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 47,992
 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 520 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,29,188 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 81,63,572 మంది కోలుకున్నారు. 4,80,719 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.              
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 12,40,31,230 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 9,29,491 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News