గవర్నర్ తో ముగిసిన విజయ్ సమావేశం... ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్
- తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్‌కు గవర్నర్ అనుమతి
- 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని లేఖలు సమర్పించిన విజయ్
- రేపు ఉదయం 10 గంటలకు చెన్నై నెహ్రూ స్టేడియంలో సీఎంగా ప్రమాణ స్వీకారం
- మే 13 లోపు అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ సూచన
- విజయ్‌తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం
తమిళనాడులో గత కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరుతూ ఆయన చేసిన విజ్ఞప్తికి గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ఆమోదం తెలిపారు.
శనివారం సాయంత్రం చెన్నైలోని లోక్‌భవన్‌లో విజయ్ గవర్నర్ ఆర్లేకర్‌తో సమావేశమయ్యారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు తమకు ఉందని గవర్నర్‌కు వివరించారు. కాంగ్రెస్ (5), సీపీఐ (2), సీపీఎం (2), వీసీకే (2), ఐయూఎంఎల్ (2) పార్టీల మద్దతుతో కలిపి తమకు మొత్తం 120 మంది ఎమ్మెల్యేల బలం ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించిన మద్దతు లేఖలను గవర్నర్‌కు సమర్పించారు.
విజయ్ విజ్ఞప్తిని పరిశీలించిన గవర్నర్, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతిస్తూ లేఖ జారీ చేశారు. అయితే, మే 13వ తేదీలోగా శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాలని విజయ్‌కు స్పష్టం చేశారు. గవర్నర్ నుంచి అనుమతి లభించడంతో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు వేగవంతమయ్యాయి.
రేపు (మే 10) ఆదివారం ఉదయం 10 గంటలకు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు తమిళనాడు లోక్ భవన్ కార్యాలయం ప్రెస్ నోట్ విడుదల చేసింది.
కాగా, రేపు విజయ్ తో పాటు మరో 9 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.