BJP: పురందేశ్వరి, డీకే అరుణలకు ఇన్‌చార్జుల బాధ్యతలు.. పలు రాష్ట్రాలకు బీజేపీ కొత్త ఇన్‌చార్జులు

బీజేపీ అధిష్ఠానం పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించింది. ఏపీకి చెందిన పురందేశ్వరిని చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల ఇన్‌చార్జ్‌గా నియమించగా.. ఆమధ్య బీజేపీలో చేరిన తెలంగాణ నేత డీకే అరుణకు కర్ణాటక సహ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇక, తెలంగాణ ఇన్‌చార్జ్‌గా తరుణ్ చౌగాను నియమించింది. 


ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్‌గా మురళీధరన్‌ను నియమించగా, సహ ఇన్‌చార్జ్‌గా సునీల్ దేవధర్‌ను కొనసాగించింది. మధ్యప్రదేశ్ ఇన్‌చార్జ్‌గా మురళీధర్‌రావు, ఉత్తరప్రదేశ్ సహ ఇన్‌చార్జ్‌గా సత్యకుమార్, తమిళనాడు సహ ఇన్‌చార్జ్‌గా పొంగులేటి సుధాకర్‌రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించింది.

BJP
Telangana
Tarun Chugh
DK Aruna
Daggubati Purandeswari

More Telugu News