సీఎం గారూ, నంద్యాల ముద్దాయిల తరఫున టీడీపీ న్యాయవాది వాదిస్తే బెయిల్ వచ్చిందనడం ఘోరం: వర్ల
- నంద్యాల ఆటోడ్రైవర్ ఫ్యామిలీ ఆత్మహత్య
- సీఐ, హెడ్ కానిస్టేబుల్ ఆరెస్ట్
- బెయిల్ మంజూరు చేసిన కోర్టు
ఇటీవల నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం అనే ఆటోడ్రైవర్ కుటుంబం పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడడం తెలిసిందే. ఈ కేసులో సీఐ సోమశేఖర్ రెడ్డితో పాటు ఓ హెడ్ కానిస్టేబుల్ ను కూడా అరెస్ట్ చేశారు. వీరిద్దరికీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.