సీఎం గారూ, నంద్యాల ముద్దాయిల తరఫున టీడీపీ న్యాయవాది వాదిస్తే బెయిల్ వచ్చిందనడం ఘోరం: వర్ల

  • నంద్యాల ఆటోడ్రైవర్ ఫ్యామిలీ ఆత్మహత్య
  • సీఐ, హెడ్ కానిస్టేబుల్ ఆరెస్ట్
  • బెయిల్ మంజూరు చేసిన కోర్టు
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ముఖ్యనేత వర్ల రామయ్య విమర్శలు చేశారు. సీఎం గారూ, నంద్యాల ముద్దాయిల తరఫున టీడీపీ లాయర్ వాదిస్తే బెయిల్ వచ్చిందని మీరు అనడం ఘోరం అని వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ఎంఐఎం అధినేత ఒవైసీకి బీజేపీ నేత రఘునందన్ రావు న్యాయవాది అని, రామ్ జెఠ్మలాని ఎన్నోసార్లు కాంగ్రెస్ తరఫున కోర్టుల్లో వాదించారని ఉదహరించారు. అసలు మీ ప్రభుత్వమే నంద్యాల కేసును కోర్టులో నీరుగార్చిందని వర్ల రామయ్య ఆరోపించారు.

ఇటీవల నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం అనే ఆటోడ్రైవర్ కుటుంబం పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడడం తెలిసిందే. ఈ కేసులో సీఐ సోమశేఖర్ రెడ్డితో పాటు ఓ హెడ్ కానిస్టేబుల్ ను కూడా అరెస్ట్ చేశారు. వీరిద్దరికీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

Varla Ramaiah
Jagan
Nandyal
Bail

More Telugu News