Surya: పొలిటికల్ ఎంట్రీపై హీరో సూర్య స్పందన

తమిళనాట ప్రస్తుతం సినీ హీరోల రాజకీయాలపై ఎక్కువ చర్చ జరుగుతోంది. కమలహాసన్ ఇప్పటికే తన రాజకీయ పార్టీపై పూర్తిగా దృష్టిని సారించారు. రజనీకాంత్ తన ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. మరోవైపు హీరో విజయ్ పేరు మీద ఆయన తండ్రి రాజకీయ పార్టీని రిజిస్టర్ చేయించడంపై పెద్ద చర్చే జరిగింది. తాజాగా మరో హీరో సూర్య కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఈ అంశంపై సూర్య స్పష్టతనిచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన మెదడులో ఉండే ఆలోచనలన్నీ తన మనసులో నుంచే వస్తాయని చెప్పాడు. నిజం చెప్పాలంటే, తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని తెలిపాడు. మరోవైపు ఈ మధ్య కాలంలో విడుదలైన సూర్య చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం 'ఆకాశం నీ హద్దురా' చిత్రంలో సూర్య నటిస్తున్నాడు. సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తోంది.
Surya
Political Entry
Kollywood
Tollywood

More Telugu News