Samantha: హీరోయిన్ సమంత షోలో విజయ్ దేవరకొండ.. ఫొటోలు వైరల్!

vijay in sam show
షార్ట్స్‌లో చూడండి
'ఆహా' ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం హోస్ట్ అవతారం ఎత్తిన సమంత  'సామ్ జామ్' అనే షోను రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలను ఆహ్వానించి ఆమె ఇంటర్వ్యూ చేస్తుంది. ఇప్పటికే ఈ షో షూటింగ్ ప్రారంభం కాగా, టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈ షోకు హాజరయ్యాడు.

ఆహా కార్యాలయం వద్ద   'సామ్ జామ్' షో పోస్టర్ వద్ద సిల్వర్ కలర్ సూట్‌తో విజయ్ ఫొటోలు తీసుకున్న ఫొటో బయటకు వచ్చింది. ఈ షోలో మరింత మంది ప్రముఖులను కూడా త్వరలోనే సామ్ ఇంటర్వ్యూ చేయనుంది. ఈ నెల 13వ తేదీ నుంచి ఈ షో ప్రసారం కానుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పలు సినిమాల్లో నటిస్తున్నాడు. అలాగే, పెళ్లి తర్వాత కూడా పలు సినిమాల్లో నటించి అలరించిన సమంత ఇటీవల బిగ్‌బాస్‌లో వ్యాఖ్యాతగా కనపడి అందరినీ అలరించింది.
Go Back to Shorts
Samantha
Vijay Devarakonda
Tollywood

More Telugu News