ట్రంప్ శకం ముగిసింది... కొన్ని దేశాలకు ఊరట అంటూ చైనా మీడియా కథనాలు
- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి
- బైడెన్ ఎన్నికను స్వాగతించిన చైనా అధికారిక మీడియా
- ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయని ఆశాభావం
- ట్రంప్ ఓటమి కొన్ని దేశాలకు ఊరట అని వ్యాఖ్యలు
ట్రంప్ తో పోలిస్తే బైడెన్ విదేశీ వ్యవహారాల్లో పరిణతితో వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొంది. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నిక ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గిస్తుందని, వాడీవేడి వాతావరణంలో మార్పు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఏదేమైనా ట్రంప్ ఓటమితో కొన్నిదేశాలకు ఊరట కలిగిందని చైనా మీడియా అభిప్రాయపడింది.