మొదట ఇంట్లో వాళ్లను ఒప్పించారు... ఆ తర్వాత ఐ లవ్యూ చెప్పారు: తమ లవ్ స్టోరీ చెప్పిన రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మొదట ఇంట్లో వాళ్లను ఒప్పించారు... ఆ తర్వాత ఐ లవ్యూ చెప్పారు: తమ లవ్ స్టోరీ చెప్పిన రోజా

Roja Selvamani reveals their love story
  • రాజకీయాలు, టీవీ షోలతో దూసుకుపోతున్న రోజా
  • దర్శకుడు సెల్వమణితో ప్రేమ వివాహం
  • ఓ టీవీ షోలో తన లవ్ స్టోరీ చెప్పిన వైనం
రోజా... ఓ డైనమిక్ మహిళ అనడంలో సందేహంలేదు. అటు రాజకీయ నాయకురాలిగా, ఇటు టీవీ కార్యక్రమాలతో ఆమె తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. తాజాగా ఓ టీవీ కార్యక్రమం ఎపిసోడ్ లో తన ప్రేమకథను వివరించారు. దర్శకుడు ఆర్కే సెల్వమణి తనకు ఎలా ప్రపోజ్ చేసిందీ వెల్లడించారు. ఆ సమయంలో సీతారత్నంగారి అబ్బాయి షూటింగ్ జరుగుతోందని తెలిపారు.

"సాధారణంగా ఎవరైనా ముందు తాము ఇష్టపడిన వాళ్లకు చెబుతారు. కానీ సెల్వమణి నేరుగా నాకు చెప్పకుండా, ముందు మా ఇంట్లో వాళ్లకు చెప్పాడు. వాళ్లు ఒప్పుకున్న తర్వాతే నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు సీతారత్నంగారి అబ్బాయి షూటింగ్ కోసం సెట్స్ పై ఉన్నాను. నా వద్దకు వచ్చి... మన పెళ్లికి మీ ఇంట్లో వాళ్లు ఓకే చెప్పారు... ఐ లవ్యూ అంటూ అసలు విషయం చెప్పాడు" అని రోజా వివరించారు.

రోజా, సెల్వమణి 2002లో పెద్దల అంగీకారంతో పెళ్లిచేసుకున్నారు. వారికి అన్షుమాలిక, కృష్ణలోహిత్ అనే ఇద్దరు పిల్లలున్నారు.
Roja
Selvamani
Love Story
Tollywood

More Telugu News