'మర్డర్' విడుదలకు అనుమతి లభించిన నేపథ్యంలో వర్మ వ్యాఖ్యలు!
- వాస్తవాల ఆధారంగా ఎన్నో సినిమాలు తీశాను
- ఎవరినీ కించపరచ లేదు
- 'మర్డర్' వారి కథ కాదన్న వర్మ
చాలా పాప్యులర్ అయిన ఓ కేసు ఆధారంగా ఈ సినిమా తీశానని అందరూ అనుకున్నారని, అది కాదని తాను ఎన్నడో చెప్పానని, ఇక, కేసులు పెట్టిన వాళ్ల కారణాలు వాళ్లకు ఉంటాయని అన్నారు. తనకు ఎవరినీ కించపరిచే ఉద్దేశాలు లేవని, ఎన్నడూ కించపరచలేదని అన్నారు. గతంలోనూ తాను శివ, సర్కార్, రక్తచరిత్ర వంటి చిత్రాలను వాస్తవ జీవితంలో జరిగిన ఇతివృత్తాలను తీసుకునే నిర్మించానని, ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని వర్మ అన్నారు.