భవన నిర్మాణ, శిథిల వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ను ప్రారంభించిన కేటీఆర్

KTR inaugurates construction waste recycling plant
  • జీడిమెట్లలో ప్లాంటును ప్రారంభించిన కేటీఆర్
  • సిటీలో మొత్తం 5 ప్లాంట్లను ప్రారంభిస్తామన్న మంత్రి
  • చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయవద్దని కోరిన కేటీఆర్
హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు సరాసరి 2 వేల టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. శిథిలాల నిర్వహణలో సౌతిండియాలోనే తెలంగాణ బెస్ట్ గా ఉందని చెప్పారు. జీడిమెట్లలో నిర్మించిన భవన నిర్మాణ, శిథిలాల వ్యర్థ్యాల రీసైక్లింగ్ ప్లాంటును ఈరోజు కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఈ ప్లాంటు ద్వారా జీహెచ్ఎంసీ, రాంకీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో వ్యర్థాలను రీసైక్లింగ్ చేయనున్నట్టు చెప్పారు. ఎల్బీనగర్ లో ని ఫతుల్ గూడలో సంక్రాంతి పండుగ నాడు మరో ప్లాంటును ప్రారంభిస్తామని తెలిపారు. నగరంలో మొత్తం 5 ప్లాంట్లను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయవద్దని ప్రజలను కోరారు. చెత్త తరలింపు కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800 1200 72659కి సమాచారం ఇవ్వాలని చెప్పారు.
Go Back to Shorts
KTR
TRS
GHMC
Hyderabad

More Telugu News