గోవా బీచ్ లో నగ్నంగా పరుగెత్తిన మిలింద్ సోమన్ పై కేసు నమోదు
Add ap7am to your home Screen

గోవా బీచ్ లో నగ్నంగా పరుగెత్తిన మిలింద్ సోమన్ పై కేసు నమోదు

Milind Soman Runs Naked On Goa Beach
  • ఫొటోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మిలింద్ భార్య
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన గోవా సురక్షా మంచ్
  • బహిరంగ ప్రదేశంలో అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ ఫిర్యాదు
సినీ నటుడు, మోడల్ మిలింద్ సోమన్ పై గోవా పోలీసులు కేసు నమోదు చేశారు. తన 55వ పుట్టిన రోజు సందర్భంగా గోవా బీచ్ లో నగ్నంగా పరుగెత్తినందుకు కేసు పెట్టారు. బీచ్ లో ఆయన పరుగెత్తుతుండగా.... ఆయన భార్య అంకిత కాన్వార్ ఫొటో తీసింది. అనంతరం ఈ ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

ఈ ఫొటొ కాస్తా ఇప్పుడు వివాదాస్పదమైంది. గోవా సురక్షా మంచ్ సభ్యులు మిలింద్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బహిరంగ ప్రదేశంలో అభ్యంతరకరంగా వ్యవహరించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు మిలింద్ పై కేసు నమోదు చేశారు.

మరోవైపు గోవాలోని ఓ డ్యామ్ వద్ద అశ్లీల వీడియోను చిత్రీకరించిన నేపథ్యంలో సినీ నటి పూనం పాండే, ఆమె భర్తతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Milind Soman
Goa Beach
Naked

More Telugu News