Corona Virus: దేశంలో కొత్తగా 46,964 కరోనా కేసులు

46964 new COVID19 infections in india
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో 46,964 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 81,84,083 కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 470 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,22,111 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 74,91,513 మంది కోలుకున్నారు. 5,70,458 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 10,98,87,303 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,91,239 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News