పోలవరంను ఏటీఎంలా వాడుకున్నాడని సాక్షాత్తు ప్రధానే ఆవేదన వ్యక్తం చేశారు: విజయసాయిరెడ్డి
- చంద్రబాబు కక్కుర్తి ఏపీకి శాపంగా మారింది
- కమిషన్ల కోసం కేంద్రం పెట్టిన షరతులు ఒప్పుకున్నాడు
- వ్యవస్థను జగన్ గాడిలో పెడుతున్నాడు
'పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్ల నుంచి యూనివర్సిటీల వరకు నిధులివ్వకుండా గాలికొదిలేసి ప్రైవేటు విద్యా సంస్థలను ఎగదోశాడు. తన బంధువర్గం, పార్టీకి ఫండింగ్ చేసే కార్పొరేట్ మాఫియాకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు బాబు. విద్య అనేది ప్రభుత్వ బాధ్యతే కాదని సెలవిచ్చిన ‘విజనరీ’ కదా!' అంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధుల్లో కేంద్ర ప్రభుత్వం భారీ కోతను విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం వైసీపీ ప్రభుత్వానికి చేత కాలేదని, గతంలో పోలవరంకు వ్యతిరేకంగా వైసీపీ ఫిర్యాదులు చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు దీనికంతా గత టీడీపీ ప్రభుత్వ అవినీతే కారణమని వైసీపీ నేతలు దుయ్యబడుతున్నారు.