శామీర్ పేటలో అదృశ్యమైన బాలుడి మృతదేహం ఔటర్ రింగ్ రోడ్ పక్కన లభ్యం
- శామీర్‌పేటలో అదృశ్యమైన అతియాన్
- ఆ బాలుడు ఉంటోన్న ఇంట్లోనే అద్దెకు బీహార్ వాసి సుదర్శన్ శర్మ
- షేర్ చాట్ వీడియో తీసుకునేందుకు ఇద్దరూ యత్నం
- ప్రమాదవశాత్తూ పడిపోయిన బాలుడు
- భయంతో మృతదేహాన్ని తీసుకెళ్లి పడేసిన శర్మ
ఆ బాలుడు ఉంటోన్న ఇంట్లోనే బీహార్ వాసి సుదర్శన్ శర్మ అద్దెకు ఉంటున్నాడని, అతడితో కలిసి షేర్ చాట్ వీడియో తీసుకునేందుకు సుదర్శన్ శర్మ ప్రయత్నించాడని, ఆ సమయంలో బాలుడు ప్రమాదవశాత్తూ భవనం పై నుంచి కిందపడి, మృతి చెందాడని పోలీసులు గుర్తించారు. దీంతో భయంతో ఆ మృతదేహాన్ని ఔటర్ రింగ్ రోడ్ పక్కన పడేశాడని సుదర్శన్ శర్మ పోలీసులకు తెలిపారు. సుదర్శన్ శర్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కేసులో తదుపరి విచారణ జరుపుతున్నారు.