KTR: ఇంటింటికీ కేటీఆర్... వరద బాధితులకు ఆర్థికసాయం అందిస్తున్న ఫొటోలు ఇవిగో!

KTR distributes financial help to flood effected poeple
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాదులో వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల ఆర్థికసాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థికసాయం పంపిణీ నేడు మొదలైంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా కొన్ని ఇళ్లకు వెళ్లి రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం బాధితులకు అందిస్తున్నారు. ఖైరతాబాద్ లోని ఎంఎస్ మక్తా, రాజు నగర్ ప్రాంతాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక కార్పొరేటర్ విజయ రెడ్డి కూడా ఉన్నారు.
Go Back to Shorts
KTR
Help
Floods
Hyderabad
Telangana

More Telugu News