దర్శకుడిగా రామ్ పోతినేని.. బర్త్ డే రోజున ఫ్యాన్స్‌కు అదిరిపోయే స‌ర్‌ప్రైజ్‌!

Ram Pothineni To Direct RAPO23 Psychological Action Thriller
  • దర్శకుడిగా మారిన హీరో రామ్ పోతినేని
  • పుట్టినరోజున తన 23వ చిత్రంపై కీలక ప్రకటన
  • ‘రాపో సినిమాటిక్స్’ పేరుతో కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభం
  • సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ను తెర‌కెక్కిస్తున్న రామ్‌ 
  • 2026 డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక ఊహించని కానుక ఇచ్చారు. నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆయన, ఇప్పుడు దర్శకుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తన 23వ చిత్రం (RAPO23)తో మెగా ఫోన్ పట్టనున్నట్లు వెల్లడించడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.

ఈ చిత్రాన్ని ఒక ఉత్కంఠభరితమైన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇందులోని ‘వీర’ అనే పవర్ ఫుల్ పాత్ర‌లో రామ్ క‌నిపించ‌నున్నారు. ‘ది స్టోరీ ఆఫ్ ఏ లోన్ వోల్ఫ్’ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ పోస్టర్‌ను బట్టి రామ్ ఒక ఇంటెన్స్ పాత్రతో రాబోతున్నారని అర్థమవుతోంది.

ఈ సినిమా కోసం రామ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కుటుంబానికి చెందిన ‘స్రవంతి మూవీస్’ బ్యానర్ ఉండగానే, ప్రత్యేకంగా ‘రాపో సినిమాటిక్స్’ (RAPO Cinematics) పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్‌పై రామ్ సోదరుడు కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

దర్శకుడిగా తన తొలి అడుగుపై రామ్ స్పందిస్తూ.. “ఇన్నాళ్లు వాళ్ల కథల్లో నా ముఖం చూశారు.. ఈ కథలో నా గొంతు వింటారు” అంటూ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. భారీ అంచనాల మధ్య రూపొందనున్న ఈ చిత్రం 2026 డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Go Back to Shorts
Ram Pothineni
RAPO23
Ram Pothineni director
Telugu cinema
Tollywood
RAPO Cinematics
Krishna Pothineni
Sravanthi Movies
Psychological action thriller
Veera movie

More Telugu News