Aamir Khan: అమీర్ ఖాన్ పక్కటెముకకు గాయం?

Aamir Khan wounded in shooting
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సినిమా షూటింగ్ లో గాయపడినట్టు సమాచారం. అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా 'లాల్ సింగ్ చద్దా' అనే సినిమా తెరకెక్కుతోంది. లాక్ డౌన్ నిబంధనలను సడలించిన తర్వాత ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది.

ఢిల్లీలో షూటింగ్ జరుగుతుండగా అమీర్ గాయపడినట్టు బీటౌన్ టాక్. అమీర్ పక్కటెముకలకు గాయమైనప్పటికీ... పెయిన్ కిల్లర్లు తీసుకుని ఆయన షూటింగ్ ను కొనసాగిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే లక్ష్యంతో యూనిట్ ఉంది. ఈ నేపథ్యంలోనే బ్రేక్ లేకుండా షూటింగ్ నిర్వహిస్తున్నారు.
Go Back to Shorts
Aamir Khan
Bollywood
Wound

More Telugu News