బెంగళూరుపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
- ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు
- తొలి మ్యాచ్ లో బెంగళూరు వర్సెస్ రాజస్థాన్
- బెంగళూరు జట్టులో మాన్, అహ్మద్ లకు చోటు
బెంగళూరు జట్టులో షాబాజ్ అహ్మద్, గుర్ కీరత్ సింగ్ మాన్ లను తీసుకున్నారు. శివం దూబే, మహ్మద్ సిరాజ్ లను తప్పించారు. ఇక రాజస్థాన్ జట్టులో ఎలాంటి మార్పు లేదు. ఈ టోర్నీలో ఇప్పటివరకు బెంగళూరు జట్టు 8 మ్యాచ్ లు ఆడి 5 మ్యాచ్ లలో నెగ్గగా, రాజస్థాన్ జట్టు 8 మ్యాచ్ లు ఆడి 5 ఓటములు చవిచూసింది. ఈ నేపథ్యంలో కోహ్లీ సేనదే పైచేయిగా కనిపిస్తోంది.