మాజీ మంత్రి నాయిని ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స
- కరోనా నుంచి కోలుకుని ఇటీవలే డిశ్చార్జ్ అయిన నాయిని
- ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో మంగళవారం మళ్లీ ఆసుపత్రిలో చేరిక
- నాయిని భార్య అహల్యకు కూడా కరోనా
అయితే, తనకు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని చెప్పడంతో పరీక్షలు నిర్వహించగా న్యుమోనియా సోకినట్టు గుర్తించారు. దీనికి తోడు ఆక్సిజన్ స్థాయులు కూడా పడిపోవడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, కరోనా బారినపడిన నాయిని భార్య అహల్య బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్లో చికిత్స పొందుతున్నారు. నాయిని అల్లుడు, రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ అయిన వి. శ్రీనివాసరెడ్డి, ఆయన పెద్ద కుమారుడు కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.