Somu Veerraju: వీటి నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే లక్ష్యంగా పని చేద్దాం పవన్ గారు: సోము వీర్రాజు

somu veerraju repaly to pawan
షార్ట్స్‌లో చూడండి
బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజుకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన నిబద్ధతను కొనియాడిన విషయం తెలిసిందే. ఆయన నిబద్ధతను గుర్తించిన బీజేపీ అగ్ర నాయకత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన తుది వరకు నిలబడతారని, పార్టీకి మంచి ఫలితాలు అందిస్తారని ఆయనను బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఎన్నుకుందని, ఆయనతో కలిసి పనిచేస్తామని చెప్పారు. పవన్ వ్యాఖ్యలపై సోము వీర్రాజు స్పందిస్తూ.. ట్వీట్ చేశారు.

‘హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీ పవన్ కల్యాణ్ గారు. బీజేపీ - జనసేన పార్టీలు రాష్ట్ర ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తాయి.. కుటుంబ, వారసత్వ పార్టీల నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే లక్ష్యంగా పని చేద్దాం’ అని పవన్ కు సోము వీర్రాజు పిలుపునిచ్చారు.
Go Back to Shorts
Somu Veerraju
BJP
Andhra Pradesh
Janasena

More Telugu News