చిరంజీవి చెల్లెలుగా డ్యాన్సింగ్ స్టార్..?
- మెహర్ రమేశ్ డైరెక్షన్ లో చిరు చిత్రం
- సాయిపల్లవికి చాన్స్
- ప్రస్తుతం ఆచార్య చిత్రం చేస్తున్న మెగాస్టార్
తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాలమ్ చిత్రంలో ఆయన చెల్లెలుగా లక్ష్మీమీనన్ నటించింది. ఇప్పుడదే పాత్రను డ్యాన్సింగ్ స్టార్ సాయిపల్లవి దక్కించుకుందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సీరియస్ ఫ్యామిలీ డ్రామా చిత్రంలో సాయిపల్లవి ఎలా అలరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మెగాస్టార్ చిత్రం కావడంతో ఇప్పుడిదే హాట్ టాపిక్ లా మారింది. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పూర్తయితే మెహర్ రమేశ్ తో చిత్రం పట్టాలెక్కనుంది.